హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో ఆర్‌ఎంపీ వైద్యుడు భార్య దారుణ హత్యకు గురైంది. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో ఆర్‌ఎంపీ వైద్యుడు ఉమామహేశ్వరరావు భార్య సంధ్యా రాణి, పిల్లలతో స్థానికంగా నివాసం ఉంటున్నారు. అయితే ఉమామహేశ్వరరావు క్లినిక్‌కు వెళ్లాడు. పిల్లలు ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి తండ్రికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.