హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర డా. బీ ఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియపై సమీక్షలో చర్చించారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.