తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో జీరో అవర్లోమాట్లాడుతూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం స్థలం ఇవ్వమంటే అధికారులు ఇవ్వలేకపోయారని విమర్శించారు. తాను అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేనని, తనకు ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.