మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి, రైతాంగానికి తీరని లోటు అని వ్యవసాయ రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్కే భవన్ లో మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవిఎన్ రెడ్డి, రాములు నాయక్, రైతులు పాల్గొన్నారు.