రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మల్కాజ్ గిరి పార్లమెంట్. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం బాలానగర్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జీ బండి రమేష్ తో పాటు డివిజన్ అద్యక్షులు, పార్టీ నాయకులతో నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి సంభందించి వివరాలను అడిగి తెలుసుకున్నారు