కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట వై జంక్షన్ వద్ద కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం నాయకులు ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ నాయకులకు, వారి పాలనపై చాలెంజ్ చేశారు. వారు ఇచ్చిన హామీలపై అమలు చేయని హామీలపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చ కు సిద్ధమన్నారు. పేద ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అండగా ఉంటుందన్నారు.