కూకట్ పల్లి: భారీ బందోబస్తు నడుమ గ్రూప్-2 పరీక్ష

57చూసినవారు
కూకట్ పల్లిలో గ్రూప్-2 పరీక్షలు భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. ఉదయం 8: 30 నుంచే అభ్యర్థులను పోలీసులు హాల్ లోపలికి అనుమతించారు. ఉదయం 9: 30 కు సెంటర్ల గేట్ లకు తాళం వేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. సెంటర్ పరిసర ప్రాంతాల్లో 163 సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్