మలక్ పేట్ మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన 5 బైకులను దగ్ధం చేసిన కేసులో నిందితుడు జాకీర్ అలియాస్ బంటాను ఎస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ చదర్ ఘాట్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. గతంలో సైతం పలు వాహనాలను దగ్ధం చేసి తప్పించుకుని తిరిగినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ఆధారంగా అతడిని పోలీసులు కనిపెట్టారు. నిందితుడిని విచారిస్తున్నారు