బైకును ఢీ కొట్టిన లారీ... ఒకరు మృతి

59చూసినవారు
చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి సవెరా హోటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న యువకుడిని అతి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్