కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని బీఆర్ఎస్ చేసినట్లు చెప్పుకోచ్చింధన్నారు. పాత అభివృద్ది పనులను తాము చేసినట్లు రంగులు అద్దారని అంతే తప్ప చేసింది ఏమీ లేదని డిప్యూటి సీఎం ఎద్దేవా చేశారు.