అల్వాల్లో గృహిణి ఆత్మహత్య

6496చూసినవారు
అల్వాల్లో గృహిణి ఆత్మహత్య
ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. కానాజీగూడ గ్రీన్ హిల్స్ కాలనీలో నివసించే సాయికుమార్తో కవాడిగూడ వాసి అనూష (29)కు 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కాగా మంగళవారం అనూష ఇంట్లోని బాత్ రూమ్లో పుస్తెలతాడుతో ఉరేసుకుని చనిపోయింది. అనూష తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్