దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో నిన్న శ్రావణి(18) అనే విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో శనివారం విద్యార్థిని బంధువులు, కుటుంబ సభ్యులు గాంధీ మార్చురీ ఎదుట ధర్నా నిర్వహించారు. శ్రావణి మృతి పై అనుమానాలు ఉన్నాయని, కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం తర్వాత శ్రావణి డెడ్ బాడీని కుటుంబీకులకు అప్పగించారు.