నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వినాయకనగర్ చౌరస్తాలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తాగిన మైకంలో గొడవకు దిగిన కొందరు వ్యక్తులు రాయితో దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.