శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్‌లు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీని పరిధిలోని కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు శనివారం కోరారు.