మేడ్చల్ నియోజకవర్గం జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి హార్డ్వేర్, పెయింట్ షాపుల్లో గురువారం మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజన్ వాహనాలు అందుబాటులో లేక రహదారిపై వెళ్లే నీటి ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.