ఉరేసుకొని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి డబిల్ పూర్ గ్రామంలో ఉంటున్న అశ్విని(24) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అశ్విని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.