నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 52 మంది లబ్దిదారులకు దాదాపు రూ. 27 లక్షల విలువజేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం పద్మారావు గౌడ్ అందించారు.