దిల్ సుఖ్ నగర్ లో కురుస్తున్న భారీ వర్షం
ఎల్బీనగర్, నాగోల్, బి.యన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ అబ్దుల్లాపూర్మెట్ పలు ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీనితో విద్యుత్ సరఫరాకి ఆటంకం ఏర్పడింది. మండుటెండల్లో ఈ వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడటంతో నగర వాసులకి ఉక్కపోత, తీవ్ర వేడిమి నుండి ఉపశమనం కలిగినట్లుగా అయింది.