రజకులను ఎస్సీ జాబితాలోకి వెంటనే చేర్చాలని, అదే విధంగా ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో మే 6వ తారీఖున ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో నిర్వహించబోయే రజక మహా ధర్న కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ చేతుల మీదగా మంగళవారం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ రజక, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతూరి రవి రజక, రాష్ట్ర ఉపాధ్యక్షులు అక్కినపల్లి గణేష్ రజక, రాష్ట్ర కార్యదర్శి సతీష్ కుమార్ రజక, రాము రజక, కుమార్ రజక తదితరులు పాల్గొన్నారు.