కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో వాహనాలను రోడ్డు రోలర్స్ ను దొంగలించి ముక్కలుగా చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను జీడిమెట్ల పోలీసులు గురువారం అరెస్టు చేసారు. ఈ నెల20వతేదీన జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో పార్క్ చేసిన రోడ్డు ప్రక్కన నిలిపి ఉంచిన రోలర్ వాహనం కనిపించక పోవడంతో యజమాని లక్ష్మణ్ జీడిమెట్ల పోలీసులకు పిర్యాదు చేసాడు. సిసి కెమారాల ఆధారంగా కేసును ఛేదించారు.