బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆలయానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. వ్యాపారస్తులు కూడా చెత్త కుండీలు ఏర్పాటు చేసుకోకపోవడంతో వ్యర్థాలను రోడ్డుపై వదిలేస్తున్నారు. దీనిపై ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.