సీతాఫల్మండి సెట్విన్ కేంద్రం కార్యకలాపాలు విస్తరించి, రాష్ట్రంలో మోడల్గా తీర్చిదిద్దుతామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సెట్విన్ కేంద్రం విస్తరణలో భాగంగా అదనపు స్లాబ్ నిర్మాణం పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. నిర్మాణంలో నాణ్యతను పాటించడంతో పాటు అన్ని ట్రేడ్లకు అవసరమైన శిక్షణ కల్పించేలా ఏర్పాట్లు జరపాలని అధికారులను పద్మారావు గౌడ్ ఆదేశించారు.