జేబీఎస్ నుంచి మేడ్చల్ వెళ్లే మెట్రో కారిడార్ మార్గంలో ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి రోడ్డులో షార్ప్ కర్వ్ (సడన్ మూల మలుపు) వస్తుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కఠిన పరిస్థితులను సైతం అధిగమించేందుకు సోమవారం కంటోన్మెంట్ ఏరియాలో విస్తృతంగా పర్యటించారు. మరోవైపు జేబీఎస్ వద్ద డిఫెన్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ భూములు దాదాపు 30 ఎకరాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.