తిరుమల లడ్డును కల్తీ చేసినవారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ సికింద్రాబాద్ నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ. పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం దారుణమని మండిపడ్డారు. దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.