మొట్టమొదటిసారిగా తెలంగాణ దండోరా కార్యాలయాన్ని సందర్శించిన వనపర్తి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ లోకనాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది బత్తిని రాము. ఆదివారం నాడు కొల్లాపూర్ నియోజకవర్గంలోని తెలంగాణ దండోరా కార్యాలయానికి వచ్చిన సందర్భంగా తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ, ఘనంగా శాలువాతో వారిని సన్మానించారు. ఈ సందర్భంగా లోక్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ దండోరా, తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం కళాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామాని ఆయన హామీ ఇచ్చారు. కళాకారులను ఆదుకుంటామని చెప్పిన లోక్ నాథ్ రెడ్డిని కళాకారులు కూడా అభినందించారు. తదనంతరం కార్యాలయంలో భోజనం కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ పాణిగంటి బాలస్వామి, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు గంధం నాగరాజు, తెలంగాణ దండోరా తాలూక జర్నలిస్ట్ అధ్యక్షుడు చారకొండ బాబు, తెలంగాణ దండోరా చిన్నంబాయి మండల అధ్యక్షుడు బచ్చలకూర స్వామి, తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కటేపాగ నరసింహ, అధ్యక్షుడు పోతుగంటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎల్ల పోగు చందు, వడ్డే మాన్ నరసింహ, సల్లేస్వరం, డప్పు మధు, జ్యోతి, ఉమామహేశ్వరి నాగరాజు, పర్వతాలు, యాదగిరి, స్వాములు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.