పద్మారావు నగర్ స్కంధగిరి ఆలయం వద్ద రాంనగర్ కు చెందిన అయ్యప్ప స్వాములు బుధవారం నిరసనకు దిగారు. జనవరి 1వ తేదీని వేడుకగా జరుపుకోకూడదని నిరసన తెలిపారు. హిందువులకు ఉగాది పండుగ నూతన సంవత్సరం అని, జనవరి 1వ తేది ఆంగ్లేయుల నూతన సంవత్సరం అని తెలిపారు. పాశ్చాత్య కల్చర్ ను హిందువులపై రుద్దుతున్నారని మండిపడ్డారు. హిందువులు మేల్కొని జనవరి 1వ తేదీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.