సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్‌లో ఆదివారం బస్తీబాట కార్యక్రమాన్ని కంటేస్టేడ్ ఎమ్మెల్యే ఆడమ్ సంతోష్ కుమార్ నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ, తాగు నీటి సమస్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు.