మాసబ్‌ట్యాంక్ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆరేళ్ల బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలు పడిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం లిఫ్ట్‌లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోయింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. లిఫ్ట్ డోర్‌లు తొలగించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. తాజాగా బాలుడి ఆరోగ్య పరిస్థితి సూపరింటెండెంట్ ప్రకటన విడుదల చేశారు. శరీర లోపలి భాగాలు పూర్తిగా నలిగిపోయి దెబ్బతిన్నాయన్నారు.