సీఎంఆర్ఎఫ్ ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో బల్కంపేటకు చెందిన రాజేశ్వరికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. రూ. 75 వేల విలువైన చెక్కును అందజేసినట్లు మాజీమంత్రి పేర్కొన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే త్వరగా చెక్కులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.