మోండా డివిజన్ గురుద్వారా వెనుక ప్రాంతంలో సీసీ రోడ్, డ్రైన్ వాటర్ పైప్ లైన్ పునర్నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 37 లక్షలతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దీపిక, స్థానికులు పాల్గొన్నారు.