సికింద్రాబాద్ ఎస్డీ రోడ్ లో బుధవారం జరిగిన ప్రమాదంలో బన్సీలాల్ పేట్ లోని ఇద్దరు యువకుల మృతి స్థానికంగా తీవ్రవిషాదం నింపింది. స్థానికుల ప్రకారం. ఎర్ర హర్షిత్(20) బీజేఆర్ నగర్ వాసి, దేవి ప్రణయ్(18) సీసీ నగర్ వాసి. ఇద్దరు ఓ ప్రైవేట్ ఓ పెస్ట్ కంట్రోల్ కంపెనీలో పని చేస్తున్నారు. నైట్ డ్యూటీ చేసి ప్యారడైజ్ వద్ద ఛాయ్ తాగారు. 5నిమిషాల్లో ఇంటికి వస్తారనుకునే లోపు కార్ ఢీ కొట్టిందని వాపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.