సికింద్రాబాద్ లోని మహంకాళి పీఎస్ పరిధి బెల్సన్ తాజ్ హోటల్ సమీపంలో బుధవారం బైక్ పై వెళ్తున్న వారిని వేగంగా వచ్చిన కారు ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.