మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని గస్మండి ప్రైమరీ పాఠశాలను కార్పొరేటర్ దీపిక సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల మొత్తం కలియతిరిగి వసతులపై అరా తీశారు. ఉపాధ్యాయులతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. విద్యార్థుల హాజరు శాతం, వారికి అందిస్తున్న మధ్యాహ్న భోజనంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మంచి మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కార్పొరేటర్ సూచించారు