బోయిన్ పల్లి అంబేద్కర్ మార్కెట్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గత 20 ఏళ్లుగా రైతులకు సేవలు అందిస్తున్నామని కమిషన్ ఏజెంట్ సోమ దేవేందర్ రెడ్డి అన్నారు. గత 20 ఏళ్లలో ఎంతోమంది ఛైర్మన్ లు కొనసాగినప్పటికీ ప్రస్తుత మార్కెట్ ఛైర్మన్ ఆనంద్ బాబు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. గంటపాటు మార్కెట్ సమీపంలో గేటు ముందు ధర్నా చేపట్టారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.