సికింద్రాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చే భవనాలు ఇవి. ఎన్నో ఏళ్లుగా ప్రయాణికుల గుండెల్లో, సినిమాల్లో కనిపించిన ఈ రైల్వే స్టేషన్ భవనాలు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. ఎన్నో ప్రయాణాలకు సాక్ష్యంగా నిలిచిన ఈ భవనాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. స్టేషన్ అభివృద్ధిలో భాగంగా వీటి స్థానంలో ఎయిర్ పోర్టుల నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో పాత భవనాలను గుర్తు చేసుకుంటూ గురువారం ప్రయాణికులు ఎమోషనల్ అవుతున్నారు.