కానాజీగూడ ఇందిరానగర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ఆదివారం రాత్రి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ లో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం గంజాయి మత్తుకు అలవాటు పడిన యుకుల మధ్య పాత గొడవలు ఉన్నట్లు సమాచారం. దానిని దృష్టిలో పెట్టుకుని రాత్రి సందిల్ (23)ను ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేశారు. సందిల్ ను బంధువులు గాంధీ హాస్పటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమారం తెల్లవారు జామున మృతి చెందాడు.