తలరాత మార్చమని అధికారం ఇచ్చారు.. తల్లిని మార్చమని కాదు అని మంగళవారం బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. అమరజ్యోతి ముందు బంగారు వర్ణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పటికే ఉంది. బహుజన తల్లి బంగారం వేసుకోకూడదా? ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి అన్నారు. అధికారంలో ఉన్న పార్టీ మారితే తల్లి మారుతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు.