ఉప్పల్ నియోజకవర్గం కుషాయిగూడ పారిశ్రామికవాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తెలుగు యువత మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఆధ్వర్యంలో డా॥ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కుషాయిగూడ పారిశ్రామికవాడలో వారి జన్మదిన వేడుకలు, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.