తెలంగాణ రాష్ట్రంలో 1000 డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను వీఆర్వో, వీఆర్ఏ ల ద్వారా కాకుండా బీటెక్, డిప్లమా, ఐటిఐ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులచే డైరెక్టర్ రిక్రూట్మెంట్ పి జి పి ఎస్ సి ద్వారా మాత్రమే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఓయూ ఇంజనీరింగ్ కళాశాల నుండీ ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగ విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు.