కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీసేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లాలాపేట కు చెందిన ప్రియదర్శిని(19) పరిసర ప్రాంతాల్లో వెతికినా, స్నేహితులను వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. చేసేదేమి లేక యువతి తల్లి లావణ్య లాలాగూడ పోలీస్టే స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.