ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలన అనే అంశంపై నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలను గురువారం నిర్వహించారు. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి ఈనెల 18న నిర్వహించనున్న విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞత సభలో నగదు బహుమతులను అందించనున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు.