హైదరాబాద్: 500 మందికి ఉద్యోగ అవకాశాలు: మంత్రి
తెలంగాణలో పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ సెమీకండక్టర్ల కంపెనీ అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్లో పరిశోధనాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని మంత్రి చెప్పారు. అలెగ్రో పరిశోధనాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు