హ్యుందాయ్ తమ గ్రాండ్ ఐ10 నియోస్ కారులో కొత్త హై-సీఎన్జీ డ్యుయో ట్విన్ సిలిండర్ వెర్షన్ ను తీసుకొచ్చింది. ఎక్స్టర్ తర్వాత ఈ టెక్నాలజీతో వస్తోన్న రెండో కారు ఇది. మాగ్నా, స్పోర్ట్స్.. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధరలు వరుసగా రూ.7.75 లక్షలు, రూ.8.30 లక్షలు. డ్యుయోతో పాటు కావాలనుకునేవారికి హ్యుందాయ్ సింగిల్ సిలిండర్ వెర్షన్ ను కూడా విక్రయిస్తోంది.