మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టేది లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కోల్‌కతా ఆసుపత్రిలో 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం - హత్య, మహారాష్ట్రలోని బద్లాపూర్ పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనల నేపథ్యంలో జరుగుతున్న నిరసనలపై స్పందించిన మోదీ, సోదరీమణుల బాధ, కోపాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. "మహిళలపై నేరాలు క్షమించరాని పాపం అని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాలనుకుంటున్నా," అని ఆయన పేర్కొన్నారు.