టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. "నేను కూడా రాయలసీమ గడ్డ మీదనే పుట్టి, రాగి సంగటి, నాటు కోడి తినే పెరిగాను. సినిమా రంగంలో పనిచేస్తున్న మహిళలను జేసీ అవమానించే విధంగా మాట్లాడారు. ఆయన మాటలకు హార్ట్ అయ్యాను. నేను బతుకుతెరువు కోసం ఇండస్ట్రీకి రాలేదు. నాకు సినిమాల్లో నటించడం ఇష్టం కాబట్టి వచ్చాను. ఆయన విషయంలో లీగల్ గా ముందుకు వెళ్తాను" అని ఆమె పేర్కొన్నారు.