AP: కాకినాడ జిల్లా సామర్లకోటలో ఓ కుటుంబం చికెన్ షాపు నుంచి తెచ్చుకున్న చికెన్ చూసి అవాక్కయింది. అందులో పురుగులు కదులుతూ కనిపింపించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే చికెన్‌ను షాపుకు తీసుకెళ్లి ప్రశ్నించగా, దుకాణం యజమాని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది.