సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తనని అరెస్టు చేస్తే జైలుకు వెళ్తానని, అక్కడ ఖైదీలతో స్నేహం చేసి నాలుగు సినిమా కథలు రాసుకుంటానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసుల విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై అసహనం వ్యక్తం చేశారు. ‘నేను పరారీలో ఉన్నానని, మంచం కింద దాక్కున్నానని కొన్ని మీడియా సంస్థలు కథనాలు అల్లాయి’ అంటూ మండిపడ్డారు.