టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాగే మన పొరుగు దేశం పాకిస్థాన్ లోనూ కోహ్లికి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లి పాకిస్థాన్ కు వస్తే భారత్ ను మర్చిపోయే రీతిలో తమ అతిథి మర్యాదలు ఉంటాయని అఫ్రిదీ అన్నాడు. పాక్ లో కోహ్లి ఆడితే చూడాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని తెలిపాడు.