పని చేస్తే ప్రశంసిస్తాం.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: సీతక్క

51చూసినవారు
పని చేస్తే ప్రశంసిస్తాం.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: సీతక్క
గ్రామాల్లో పారిశుద్ధ్య, తాగునీటి సరఫరా, రోడ్ల పునరుద్ధరణపై పంచాయతీరాజ్‌ అధికారులతో మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రతి మండలానికి ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు వేయాలని ఆదేశించారు. ప్రతి మండలానికి ఐదుగురు అధికారులతో కమిటీలు వేయాలని సూచించారు. గ్రామాల్లో చెరువులు, వాగులపై కట్టడాల జాబితాను కలెక్టర్లకు ఇవ్వాలని చెప్పారు. పని చేస్తే ప్రశంసిస్తామని.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్