తెలంగాణలో నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం దేశానికి ఆదర్శమని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్ లోని ఓ రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేసి మాట్లాడారు. నిరుపేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన సన్నబియ్యం కార్యక్రమం ఎంతో విజయవంతమైనట్లు చెప్పారు. గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల దళారీ వ్యవస్థ ఏర్పడిందన్నారు. నేడు సన్న బియ్యం కార్యక్రమంతో అక్రమ దందాకు అడ్డుకట్ట వేసినట్లు అయిందని చెప్పారు.